Breaking News

ఎల్జీ పాలీమర్స్​ అక్కడ ఉండొద్దు

  • బాధితులను ఆదుకుంటాం
  • మాజీ సీఎం చంద్రబాబు

సారథి న్యూస్​, అమరావతి: గ్రామాల మధ్య ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉండడానికి వీల్లేదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన మహానాడులో తీర్మానం చేశారు. టీడీపీ మహానాడు బుధవారం మంగళగిరిలోని సెంట్రల్​ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎల్జీ కంపెనీని కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం సీజ్ చేశారన్నారు. లాక్‌ డౌన్ కారణంగా విశాఖలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించడానికి వెళ్లలేకపోయానని తెలిపారు. తాజాగా మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరానని, ప్రభుత్వ అనుమతి రానందునే వెళ్లలేకపోయానని బాబు వివరణ ఇచ్చారు.
బాధితులన పార్టీ తరఫున ఆదుకుంటాం
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి డేటా మొత్తం వచ్చిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగిందో చూసి బాధితులకు పార్టీ తరఫున ఆర్థికసాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. ఇప్పటివరకు స్టైరీన్ గ్యాస్ తీవ్రతపై శాస్త్రీయ పరిజ్ఞానం లేదన్నారు. ఎల్జీ ఘటనపై సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన రంగనాయకమ్మ, తదితరులపై కేసులు పెట్టడం అమానుషమని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.