బీహార్‌పై ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.16వేల కోట్ల తాయిలాలు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతోనే ప్రధాని మోడీకి బీహార్‌కు నిధులు కేటాయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మోడీ బీహార్‌కు రూ.16వేల కోట్ల విలువైన అభివృధ్ది ప్రాజెక్టులను ఆయన రానున్న 10 రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. ఎల్ పీజీ పైప్ లైన్, ఎల్ఫీజీ బాట్లింగ్ యూనిట్, సీవేజీ ట్రీట్ మెంట్ ప్లాంట్, కొత్త రైల్వేలైన్లు, రైల్వే వంతెనలు, వివిధ సెక్షన్ల విద్యుదీకరణ తదితర ప్రాజెక్టులను బీహార్‌లో చేపట్టనున్నారు. మోడీ తాయిలాలతో బీహార్‌లోని ఎన్డీఏ కూటమి మరింత బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.