సారథిన్యూస్, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇంచార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకటేశ్వర్రావును నియమించింది. ఆయన ఎంజీఎంలోని ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కు హెడ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
- July 28, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- MGM
- RESIGN
- SUPERINTENDENT
- WARANGAL
- అనారోగ్యం
- వరంగల్
- Comments Off on ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా