తెలుగు అమ్మాయి అంటే చాలు టాలీవుడ్లో నో చాన్స్ అంటారు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అది అనితర సాధ్యమే కూడా. కానీ ప్రయత్నాలు చేసేవాళ్లు ఆపరు కదా. ఆ కోవకే వస్తుంది ఈషారెబ్బా. మొదట్లో చిన్న హీరోల సరసన నటిస్తూ కెరీర్ స్టార్ చేసింది. తర్వాత ‘అరవింద సమేత’లో చేసినా అంతగా గుర్తింపు రాలేదు. రీసెంట్గా సత్యరాజ్‌తో కలిసి నటించిన ‘రాగల 24 నాలుగు గంటల్లో’ సినిమాతో మాత్రం ఈషాకు కొద్దిగా గుర్తింపు వచ్చింది.
నెక్ట్స్ ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ లో నటించింది. తాజాగా అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంను చేస్తున్న సుశాంత్ ఆ తర్వాత సినిమాకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఏడాదిలోనే ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో హీరోయిన్ గా ఈషారెబ్బను ఎంపికచేశారు. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో చాన్స్ కోసం ఎదురుచూస్తున్న ఈషా రెబ్బకు సుశాంత్ మూవీతో అయినా ఆ చాన్స్ లు వస్తాయేమో.. లేదో వేచి చూడాలి.