సారథి న్యూస్, నాగర్కర్నూల్: జిల్లావ్యాప్తంగా సోమవారం కార్తీకమాస పౌర్ణమి సందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో విశేషపూజలు జరిపించారు. వత్రాలు, నోములు ఆచరించారు. దీపారాధన, దీపదానం, ఆకాశ దిపోత్సవం, అర్చనలు, అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయంలోశ్రీ రామసహిత వెంకట సత్యనారాయణస్వామి వ్రతాలు చేశారు. జిల్లా కేంద్రంలోని సీతారామస్వామి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ప్రాత:కాలంలోనే పరమశివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, ఆలయంలో దీపారాధనను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్అయ్యంగార్తెలిపారు.
- November 30, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- KARTHIKA MASAM
- NAGARKURNOOL
- SATYANARAYANA SWAMY VRATHAM
- కార్తీకమాసం
- నాగర్కర్నూల్
- సత్యనారాయణ స్వామి వ్రతం
- Comments Off on ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందడి