Breaking News

ఆత్మహత్యలను ఆపుదాం!

సారథి న్యూస్, రామడుగు: ‘చావు సమస్యకు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. డిప్రెషన్​కు గురైనప్పుడు దగ్గరి వాళ్లతో మాట్లాడాలి. మనం జీవితంలో సాధించిన విజయాలను స్మరించుకోవాలి. అంతేకానీ చనిపోతే ఏ ప్రయోజనం ఉండదు. కొత్తజీవితాన్ని ప్రారంభించాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త దారిలో పయనించాలి. అప్పడే విజయం మన పాదలచెంతకు చేరుతుంది’ అని ప్రముఖ సైకాలజిస్ట్​, తెలంగాణ సైకాలజిస్ట్​ అసోషియేషన్​ జిల్లా అధ్యక్షుడు ఎజ్రా మల్లేశం సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ఆన్​లైన్​ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు సూచనలు చేశారు. ప్రపంచంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారని.. ఇది ఆందోళనకరమైన విషయమని చెప్పారు. ఈ ఆన్​లైన్​ సమావేశంలో జిల్లా కార్యదర్శి శివకుమార్, కోశాధికారి రేష్మ తదితరులు పాల్గొన్నారు.