జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షేకావత్ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గజేంద్రసింగ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న ఓ ఆడియోను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ వాయిస్ తనది కాదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆడియోటేపుల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలనీ బీజేపీ నేత సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు.