సారథి న్యూస్, కర్నూలు: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో పెద్దసంఖ్యలో 108,104 వాహనాలను ప్రారంభించారని కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కాలేజీ మైదానంలో గురువారం మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు, నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్, శ్రీదేవి, ఆర్థర్ తదితరులతో కలిసి అంబులెన్స్వెహికిల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. 108, 104 వాహన డ్రైవర్లు, టెక్నిషియన్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంచారని, ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. ఇక ప్రతి మండలం, ప్రతి గ్రామానికి ఈ వెహికిల్స్ వస్తాయన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించేందుకే..
అనంతరం ఎంపీలు డాక్టర్సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో వైద్యరంగం ప్రజందరికీ అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ.650 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. అనంతరం, ఎస్టీబిసి కాలేజ్ గ్రౌండ్స్ నుంచి కుయ్..కుయ్.. కుయ్.. అంటూ రయ్.. రయ్‌న అవుట్ డోర్ స్టేడియం మీదుగా ఎస్వీ కాంప్లెక్స్, ఓల్డ్ కంట్రోల్ రూమ్, చిల్డ్రన్స్‌పార్క్, రాజ్ విహార్ సెంటర్, కలెక్టరేట్, గుత్తి పెట్రోల్ బంక్, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండ్, ధర్మపేట, ఆర్ఎస్ రోడ్డు మీదుగా ర్యాలీగా తిరిగి ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుని ఆయా మండలాలకు చేరాయి. కార్యక్రమంలో కలెక్టర్ జి.వీరపాండియన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ డాక్టర్నిధి మీనా, డీఎంహెచ్‌వో డాక్టర్ రామగిడ్డయ్య, 108, 104 వాహనాల ఆర్గనైజర్ చంద్రమౌళి పాల్గొన్నారు.
- July 2, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- కర్నూలు
- 104 VEHICLES
- 108
- ANDRAPRADESH
- HEALTH
- ఎంపీలు
- ఎమ్మెల్యేలు
- కర్నూలు
- వైఎస్ జగన్
- Comments Off on అందరికీ మెరుగైన వైద్యసేవలు