సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో, ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల భర్తీకి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 548 ప్రధాన, 92 చిన్న అంగన్వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, చిన్న అంగన్వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. వెంటనే ఖాళీల వివరాలు సమర్పించాలని సూచించారు. అనంతరం పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి మల్లీశ్వరి, సీడీపీవోలు లక్ష్మి, హేమలత, ముత్తమ్మ, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
- June 18, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- COLLECTOR
- MULUGU
- TEACHERS
- సంక్షేమశాఖ
- సీడీపీవో
- Comments Off on అంగన్వాడీ టీచర్ల భర్తీ