Breaking News

యోగీ దిగిపో..!

సారథి న్యూస్, రామగుండం: హథ్రాస్​లో జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని దళితసంఘాలు డిమాండ్​ చేశాయి. బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ దళితులను దగా చేస్తున్నదని దళితసంఘాల నేతలు ఆరోపించారు. యూపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? మానవహక్కులు ఉన్నాయా? ప్రజాస్వామ్యదేశంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం నిస్సుగ్గుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గోదావరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల యాక్షన్ కమిటీ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో దళితసంఘాల నేతలు బొంకూరి మధు, పులి మోహన్, కొంకటి లక్ష్మణ్, కాంపెళ్లి సతీశ్​, అడకపురం చంద్రమౌళి, రాజ నరసయ్య, కందుకూరి రాజారత్నం, నారాయణ, ఈదు నూరి శ్రీకాంత్, ఇరుగురాల కృష్ణయ, పోగుల రంగయ్య, ఆకునూరి రాజన్న, మంతెన సంపత్ కుమార్, రాజలింగు, శశిభూషణ్, పెళ్లి రవికుమార్, కాదశి లచ్చయ్య, అల్లి గంటయ్య, మాలమహానాడు శ్రీహరి, సదానందం, రాము నాయక్, సీపీఐ సహాయ కార్యదర్శి దినేశ్​, ఏఐఎస్ఎఫ్ నాయకులు వీర్ల రామచందర్, ఉప్పులేటి హనుమంతు, గొర్రె నరసింహారావు, ఏ రమేశ్​ చిప్ప కుర్తి సత్యనారాయణ, అల్లి గణేశ్​, కొంకటి సిద్ధార్థ, జనగాం రాజనర్సు, జనగాం మహేందర్, హరీశ్​, పంజా అశోక్, చింతల శీను తదితరులు పాల్గొన్నారు.