Breaking News

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

క్యాంపు ఆఫీసును కట్టినప్పుడు..‘డబుల్’ ఇళ్లను నిర్మించలేరా?

సామాజికసారథి, నాగర్​కర్నూల్: పెద్దముద్దునూర్ గ్రామంలో నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్ రూమ్​ఇళ్లు, బస్టాండ్​ను తక్షణమే ప్రారంభించాలని బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ఏడాదిలో నిర్మించినప్పుడు.. పేద ప్రజలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎందుకు పూర్తిచేయలేరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ఆయన బీఎస్పీ నాయకులతో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఎమ్మెల్యే వర్గం, ఎమ్మెల్సీ వర్గం అని అమాయక జనాలను ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామాన్ని అధోగతిపాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ ఇద్దరు కలిసి పప్పుబెల్లంలా నచ్చిన వారికి పంచిపెడుతున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ను కోరారు. పంచాయతీ సెక్రటరీపై డీఎల్పీవోకు ఫిర్యాదుచేశారు. గ్రామాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కార్యదర్శులు రాంచందర్, మోతుకూరి నాగార్జున, జిల్లా నాయకులు అంతటి నాగన్న, అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు బండి పృథ్వీరాజ్, బాలరాజు, నాగరాజ్, వెంకన్న, శ్రీకాంత్, అంజి, తిరుపతి, బాలకృష్ణ, శివ, రాజ్, కురుమయ్య, రామకృష్ణ, శంకర్, రమేష్, నితిన్, మల్లేష్ పాల్గొన్నారు.