సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం, సీఈవో పుట్టి నర్సింలు, డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఆయా మండలాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
- April 26, 2021
- Archive
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- CM KCR
- medak
- MLA PADMA
- RAMAYAMPET
- ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
- మెదక్
- రామాయంపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..