సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను వారికి దక్కే విధంగా కృషి చేస్తానని నాగర్ కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో టియుడబ్ల్యూజే-హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించి కలెక్టర్ ఉదయ్ కుమార్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి 5వ తేదీన నిర్వహిస్తున్నామని ఇట్టి కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్ కుమార్ అతిధి గా రావాలని టి యు డబ్ల్యూ జే హెచ్ 143 రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 5వ తేదీన నాగర్ కర్నూల్ లో నిర్వహించే సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభలకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రాములు,ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు హాజరవుతున్నారని కలెక్టర్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కేఎస్.సురేష్, చంద్రశేఖర్ రావు, ఖానాపురం ప్రదీప్, వెంకటస్వామి, అహ్మదుల్లా ఖాన్ లతోపాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.