సారథి న్యూస్, శంషాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఇంధనం, గ్యాస్ ధరలు అధికంగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తుందని విమర్శించారు. శుక్రవారం శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గ పట్టభద్రులుగా ఎమ్మెల్సీ సురభివాణి దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టీఆర్ఎస్ నాయకుడు కార్తీక్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు నీరటి తన్వీరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి పాల్గొన్నారు.
- March 5, 2021
- Archive
- Top News
- BJP
- CM KCR
- HARISH RAO
- MLC ELECTIONS
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- బీజేపీ
- సీఎం కేసీఆర్
- హరీశ్‌రావు
- Comments Off on ఏం చేశారని ఓటు వేయాలి?