- వీసీ ప్రొఫెసర్ ఎస్. మల్లేష్
సామాజిక సారథి, కరీంనగర్: జాతీయ సమైక్యత క్యాంపుకు శాతవాహన విశ్వవిద్యాలయం వాలింటీర్లు ఎంపికైనట్లు శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 22 తేదీల్లో జరిగబోయే సాంస్కృతిక పోటీలకు బి. సంస్కృతి, ఓ. ప్రితి, వి. వాసవి, కె. శ్రీకాంత్, కె. రాము, కె. పూర్ణ, యు. ఆదిత్య, ఎస్. బిమల్, దీప్ కౌర్లు ఎంపికైనట్లు తెలిపారు. జాతీయ క్యాంపులో తెలంగాణ రాష్ట్ర వేశ, భాషా, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ కే. శ్రీవాణి, వాలంటీర్ల పర్యవేక్షకులు డి. శంకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.