సామాజిక సారధి , బిజినేపల్లి :. మండల పరిధిలోని నంది వడ్డెమాన్ గ్రామంలో శాంతయ్య అనే రైతు పత్తి పంటను తీసి డెబ్భై ఐదు సంచులను పంట పొలంలో ఉన్న షెడ్డు దగ్గర ఉంచగా గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో పత్తి దద్దమైన సంఘటన చోటుచేసుకుంది . రైతు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజుల క్రితం పంట పొలంలో పత్తిని తీసి షెడ్డు దగ్గర నిల్వ చేయగా శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టేయడంతో పంట బూడిద పాలు అయిందని కన్నీరు మున్నీరు అయ్యారు . పొలం దగ్గరకు వచ్చి చూడగా ఇప్పటికే బూడిద పాలైన పంటను చూసి లబోది పొమ్మంటూ చేతికొచ్చిన పంటను బూడిద పాలు చేయడం ఏందని బోరన విలపిస్తున్నాడు . విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకొని రైతు పంటకు నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు . దాదాపు 22 కింటల పత్తి బూడిద పాలు అయిందని తెలిపారు.
- October 27, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on పత్తికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు