సామాజిక సారథి, నాగర్కర్నూల్ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నవాడికి తాను తయారుచేసిన మద్యానికి ధర నిర్ణయించే హక్కు ఉందని, ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు లేకపాయే అని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా సాగుచట్టాలను తీసుకొచ్చిందన్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తే రైతులు బతుకుతారని అన్నారు. ఇదే సందేశాన్ని చిత్రంలో ఆర్.నారాయణమూర్తి చూపించారని కొనియాడారు. సినిమాను అద్భుతంగా మలిచారని ప్రశంసించారు. కేంద్రం అవగాహన లేకుండా సాగుచట్టాలు తెచ్చిందని విమర్శించారు.
- December 2, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- సినిమా
- ‘Raitanna’ Movie
- ‘రైతన్న’ మూవీ
- Janardhan Reddy
- MARRI
- MLA
- MOVIE
- NAGAR KURNOOL
- Narayanamurthy
- R
- ఆర్
- ఎమ్మెల్యే
- జనార్ధన్ రెడ్డి
- నాగర్ కర్నూల్
- నారాయణమూర్తి
- మర్రి
- మూవీ
- Comments Off on ‘రైతన్న’బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి