సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : కొత్త ప్రియుడు మోజులో పాత ప్రియుడునీ నెత్తిన బండరాయితో కొట్టి చంపేసిన సంఘటనలో ఇద్దరినీ మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ జక్కుల హనుమంతు తెలిపారు . ఈనెల 16వ తేదీ నా బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో చింతల కృష్ణమ్మ అనే మహిళకు గత కొన్ని లనుండి రవికుమార్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేసుకుంటూ అదే గ్రామంలో నివసిస్తున్నారు . ఇటీవల కొంత కాలం క్రితం సుంకల శ్రీనివాసులు అనే జడ్చర్ల నివాసితో కృష్ణమ్మకు మరో పరిచయం పెంచుకొని సహజీవనం చేస్తున్నారు . ఇట్టి విషయంపై రవికుమార్ కు కృష్ణమ్మ పై అనుమానం రావడంతో కృష్ణమ్మను పదేపదే వేధించడం మొదలు పెట్టాడని అతడిని ఎలాగైనా తొలగించేందుకు కృష్ణమ్మ , శ్రీనివాసులు కుట్ర పని మద్యం మత్తులో ఉన్న రవికుమార్ పై బండరాయితో నెత్తిన కొట్టి చంపారని పోలీసు విచారణలో ఇద్దరు ఒప్పుకున్నట్లు వారు తెలిపారు . సోమవారం కేసు నమోదు చేసిన బిజినపల్లి ఎస్సై ఓబుల్ రెడ్డి విచారణ అనంతరం రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు .
- January 17, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- HYDERABAD
- NAGARKURNOOL
- తెలంగాణ
- Comments Off on హత్య కేసులో ఇద్దరు రిమాండ్
… సీఐ జక్కుల హనుమంతు