- ఎండీ సజ్జన్నార్ కీలక నిర్ణయం
సామాజికసారథి, హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీగా డైనమిక్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీలో కీలక మార్పులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకర్షించి ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకెళ్లేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సంస్థలో చాలా మార్పులతోపాటు ఆదాయం భారీగా పెరిగింది. అయితే, న్యూ ఇయర్‌లోకి అడుగిడుతున్న వేళ సజ్జనార్ మరో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 రోజున బస్సులో ప్రయాణించే 12 ఏళ్ల పిల్లలకు ఉచిత ప్రయాణం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాష్ట్రమంతా 12 ఏళ్లలోపు పిల్లలు బస్సులో ఉచితంగా ప్రయాణించనున్నారు.