Breaking News

ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

ఉక్కుమనిషి పటేల్ కు ఘన నివాళి

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 147వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ మాట్లాడుతూ స్వాతంత్రపు సంగ్రామంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ సేవలు వెలకట్టలేవన్నారు. అనంతరం పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిండంతో పాటు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.