Breaking News

రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

రైతులకు ఉచితంగానే ట్రాన్స్​ఫార్మర్లు

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: దేశవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా రైతుల శ్రేయస్సుకు 24 గంటల పాటు ఉచితంగా కరెంట్​ ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతులకు ఉచితంగా ట్రాన్స్​ఫార్మర్లను అందిస్తున్నామని తెలిపారు. బుధవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​ను మంత్రి టి.హరీశ్​రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 7,778 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉండేదని, ప్రస్తుతం 16,250 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. నూతనంగా వెయ్యి సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్​ఫార్మర్లతో ఇబ్బందిపడ్డ రైతులకు విముక్తి కలిగిందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి రెడ్డి, జడ్పీటీసీ మాధవి, ఆర్డీవో సాయిరాం, డీఆర్డీవో శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, రామాయంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, డైరెక్టర్ లతీఫ్, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచ్​లు రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భిక్షపతి గౌడ్, మీనా, నీరజ పాల్గొన్నారు.