సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: పత్రికలు, మీడియా సంస్థలు ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను వెలికితీసి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన ‘సామాజికసారథి’తెలుగు దినపత్రిక క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యం, పాత్రికేయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుభవం కలిగిన పాత్రికేయ బృందంతో ‘సామాజికసారథి’దినపత్రిక సరికొత్త కథనాలు అందిస్తూ పెద్ద పత్రికలకు దీటుగా దూసుకెళ్తుందని తెలిపారు. పారదర్శకంగా వార్తలు రాస్తున్న తీరు బాగుందని కితాబిచ్చారు. మరిన్ని వార్తలతో అగ్రభాగాన నిలవాలని కోరారు. ప్రతిరోజు ప్రజాసమస్యలపై వార్తా కథనాలు అందిస్తూ అనతికాలంలోనే మంచి గుర్తింపు సాధించిందని అన్నారు. ప్రజాప్రతినిధుల సేవా కార్యక్రమాలు, అధికారుల కార్యకలాపాల సమాచారం అందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. నాగర్ కర్నూల్ బ్యూరో చీఫ్ గంగు ప్రకాష్, కౌన్సిలర్లు శ్రీనివాసులు, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సలేశ్వరం పాల్గొన్నారు.
- January 14, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- damodharreddy
- mlc damodharredddy
- Samajikasarthi
- Ssnews
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on సామాజికసారథి అగ్రభాగాన నిలవాలి