Breaking News

కరోనాను ఎదుర్కొనే శక్తి.. గొప్ప వరం

సారథి న్యూస్, మానవపాడు: ఏడాది పాటు ఒకరికి మరొకరు కలవకుండా, తల్లికి పిల్లభారమనేలా కరోనా చేసిందని, మహమ్మారిని తట్టుకునే శక్తి మనకు దేవుడిచ్చిన గొప్ప వరమని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత అన్నారు. జిల్లాలోని మానవపాడు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో మంగళవారం కరోనా వ్యాక్సినేషన్ ​ప్రక్రియను డాక్టర్ దివ్య, డాక్టర్ ఇర్షద్, డాక్టర్ సవిత సమక్షంలో ఆమె ప్రారంభించారు. వాక్సిన్ ను మొదట హెల్త్ వర్కర్, రెండో వ్యాక్సిన్ డాక్టర్ కు ఇచ్చారు. కరోనా నుంచి ఇప్పటివరకు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలందించిన వైద్యారోగ్య సిబ్బందికి రుణపడి ఉంటామన్నారు. డాక్టర్ దివ్య మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండబోవని, ప్రతిఒక్కరూ వేసుకోవాలని సూచించారు. ముందుగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ హేమవతి, తహసీల్దార్​వరలక్ష్మి, ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి, ఎంపీటీసీ మహేశ్వరమ్మ, ఎంపీడీవో రమణారావు, ఎంఈవో శివప్రసాద్, సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, ఉండవెల్లి వైస్ ఎంపీపీ దేవన్న, టీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య, దామోదర్ రెడ్డి, ఖలీమ్, మహమ్మద్, మురళి రెడ్డి, యువనాయకుడు కిషోర్, అయ్యన్న, మద్దిలేటి, ఎస్సై గురుస్వామి పాల్గొన్నారు.

కరోనా వ్యాక్సిన్​