సామాజిక సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(డీ82) కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా చెరుకూరు, పరిసర గ్రామాల బాధిత రైతులు అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో భాగంగా చెరుకూరు, భర్కత్ పల్లి, గానుగట్టుతండా రైతులకు నష్టపరిహారం చెల్లించాలని చెరుకూరు సర్పంచ్ రేవతి రాజశేఖర్ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించారు. ప్రభుత్వం భూములు తీసుకొని ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ రేవతి రాజశేఖర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, రైతుబంధు రావడం లేదని వ్యవసాయం చేసుకోవడానికి వీల్లేకుండా పోయిందని అడిషనల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో రైతులు రామకృష్ణ, మహేష్, అశోక్, కృష్ణయ్య, భానుప్రసాద్ పాల్గొన్నారు.
- December 7, 2021
- Archive
- Top News
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Additional
- Batakale
- COLLECTOR
- Etla
- Farmers
- Gunjukundannaru
- LANDS
- NAGAR KURNOOL
- అడిషనల్
- ఎట్ల
- కలెక్టర్
- గుంజుకుండన్నరు
- నాగర్ కర్నూల్
- బతకాలే
- భూములు
- రైతులు
- Comments Off on భూములు గుంజుకున్నరు.. ఎట్ల బతకాలే!