- మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి
సామాజిక సారథి, హాలియా: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షతో తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు రెండు రోజుల నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ లో చేపట్టిన రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి దీక్షకు రెండో రోజు మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి రైతులకు మద్దతుగా పాల్గొని ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అనేక సమస్యలు పరిష్కరించి ప్రజస్వామ్యాన్ని నిలా పెట్టిందన్నారు.ఆహార భద్రత చట్టాన్ని తెచ్చి పేదల జీవితాల్లో వెలుగు నింపింది అన్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, హనుమంతరావు, కోదండ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.