సామాజికసారథి, రామకృష్ణాపూర్ (మంచిర్యాల): జిల్లాలో కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలని డీఈ భాస్కర్ కు ఐక్య విద్యార్థి సంఘాల అధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో భూముల విలువలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా శిఖం భూములు కబ్జాలు చేస్తూ అక్రమ వెంచర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చెరువు శిఖాలలో జరుగుతున్న అక్రమ పనులను నిలిపివేసి కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీవీయూవీ రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్,టీబీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జాగిరి రాజేష్, టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు రేగుంట క్రాంతికుమార్, వీజేఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడు పురేళ్ల నితీష్ పాల్గొన్నారు.
- January 20, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on కబ్జాకు గురవుతున్న చెరువులను కాపాడాలి