సామాజిక సారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి తెరకెక్కించిన రైతన్న సినిమాను బుధవారం ఉదయం నాగర్‌కర్నూల్‌లోని రామకృష్ణ టాకీస్ లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తిలకించారు. రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలను మూర్తన్న చాలా బాగా ఆవిష్కరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతుల నేపథ్యంలో వచ్చిన ఇలాంటి చిత్రాలను మనమంతా ఆదరించాలి, ఆశీర్వదించాలి, అఖండ విజయం అందించాలి. అది మన బాధ్యత’ అని గుర్తుచేశారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దర్జాగా మద్యాన్ని తయారుచేసి ప్రజల ప్రాణాలు తీస్తున్నవాడికి తాను తయారుచేసిన మద్యానికి ధర నిర్ణయించే హక్కు ఉందని, ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకు లేకపాయే అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా సాగుచట్టాలను తీసుకొచ్చిందన్నారు. హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలుచేస్తే రైతులు బతుకుతారని అన్నారు. ఇదే సందేశాన్ని చిత్రంలో ఆర్.నారాయణమూర్తి చూపించారని కొనియాడారు. సినిమాను అద్భుతంగా మలిచారని ప్రశంసించారు.
- December 1, 2021
- Archive
- Top News
- MLA MARRI
- NAGARKURNOOL
- r narayanamurthy
- rythanna
- ఆర్.నారాయణమూర్తి
- ఎమ్మెల్యే మర్రి
- నాగర్‌కర్నూల్
- రైతన్న సినిమా
- Comments Off on ‘రైతన్న’ బాధ అర్థమైంది: ఎమ్మెల్యే మర్రి