Breaking News

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

పట్టుపట్టి ఏడాదిలోనే నిర్మించుకుంన్రు

  – రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు

సామాజిక సారథి, సిద్దిపేట: పెన్షనర్లు పట్టుపట్టి ఏడాదిలోనే భవనం నిర్మించుకున్నారని ఎంపీ, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని విశాంత్రి ఉద్యోగుల భవనం ప్రారంభోత్సవం చేసి మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్య పట్టణ కేంద్రాల్లో పెన్షనర్ల భవనాలు తప్పనిసరిగుండాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణాలకు అనేక చోట్ల నిధుల మంజూరు చేసిన నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎంపీ నిధుల నుంచి రూ. 25లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.21లక్షలు  మంజూరయ్యాయని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలోని మహిళలు చైతన్యవంతులని, ప్రస్తుతం మహిళలు రక్షణ, మిలటరీలో కమాండర్లుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులంటే గురువులేనని వారికి ఏ సమస్య వచ్చిన ఎల్లవేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని చెప్పారు. హుస్నాబాద్, అక్కన్నపేట మండల పరిధిలోని దాదాపుగా 200 మందికిపైగా రిటైర్డు ఉద్యోగులు ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత,వైస్ చైర్ పర్సన్ అనిత, నేషనల్ లేబర్ కో ఆపరేటర్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, ఎంపీపీలు మానస, లక్ష్మి, జడ్పీటీసీ భూక్య మంగ, మున్సిపల్ కౌన్సిలర్లు బోజ్జ హరీశ్, భగ్యరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్,  రిటైర్డు ఉద్యోగ సంఘం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.