సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. సహాయం కోసం 98487 71866 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
- May 13, 2021
- Archive
- Top News
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- COVID19
- LOCKDOWN
- RAMADUGU
- కొవిడ్
- గోపాల్ రావుపేట
- రామడుగు
- లాక్ డౌన్
- Comments Off on ఆ సర్పంచ్ మనసేంత గొప్పదో