Breaking News

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్

సారథి, వనపర్తి: కరోనా నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులపై సమీక్షించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు. గురువారం పెబ్బేరులో కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో సమావేశం నిర్వహించారు. డాక్టర్ల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అభినందనలు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఐసొలేషన్ లో ఉంచితే ఇబ్బంది ఉండదని, ఇంటింటి సర్వేలో జ్వరపీడితులను గుర్తించి మందులు అందజేయాలని కోరారు. వ్యవసాయ పనులు, దాని అనుబంధ పనులకు వెళ్లే వారికి ఎలాంటి పాసులు అవసరం లేదన్నారు. గద్వాల జిల్లాలో లక్షా 36 925 మందిని సర్వేచేసి 3,241 మందికి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. హమాలీల కొరతను అరికట్టాలన్నారు. ధాన్యం తరలింపు, మిల్లర్ల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించవద్దని సూచించారు. సమావేశంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వీఎం అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వనపర్తి ఇన్ చార్జ్ కలెక్టర్ వెంకట్రావు, వనపర్తి, గద్వాల అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, రఘురామశర్మ, ఎస్పీలు ఆపూర్వరావు, రంజన్ రతన్ కుమార్, జిల్లా వైద్యాధికారులు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.