Breaking News

TELANGANA

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి జెండా ఎగరవేసి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ ఇచ్చారని, ప్రజలు కలలుగన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ కూడా నెరవేరలేదని, అవినీతికి, అక్రమాలకు నిలయంగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. […]

Read More

ఘనంగా అవతరణ దినోత్సవం

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసుశాఖ,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్​లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులోఅడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ […]

Read More

ఇక తెలంగాణ సస్యశ్యామలం

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య​అతిథిగా పాల్గొన్న ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ జిల్లా నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల […]

Read More

అమరుల త్యాగాలతోనే తెలంగాణ

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉట్టిగా, ఆషామాషీగా రాలేదని, వందలాది మంది అమరవీరుల ఆత్మార్పణంతో ఆవిర్భవించిందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్​ గుర్తుచేశారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కలెక్టరేట్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఓ దశలో కన్నీటి పర్యంతమయ్యారు. గద్గదస్వరంతో ప్రసంగం కొనసాగించారు. నాటి తెలంగాణ ఉద్యమ […]

Read More

రాత్రి 8 దాకా మద్యం అమ్మకాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు చెప్పింది. మరో రెండు గంటల పాటు మద్యం అమ్మకాలకు పర్మిషన్​ ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కరోనా వ్యాప్తి.. లాక్‌ డౌన్‌ అమలు అనంతరం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైన్స్​ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవచ్చని ఎక్సైజ్‌ శాఖ పర్మిషన్​ ఇచ్చింది. […]

Read More

ఉద్యమకారుడి కుటుంబానికి చేయూత

సారథి న్యూస్​, రామడుగు: ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి యువతను రాష్ట్రసాధనలో కార్మోన్యుకులుగా తీర్చిదిద్దిన పెందోట మోహనాచారి కుటుంబానికి సోమవారం టీఆర్ఎస్ నాయకులు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. మామిడి నర్సయ్య, రాగం లచ్చయ్య, మాదం రమేష్, అబ్దుల్ అజీజ్, సలాఉద్దీన్ పాల్గొన్నారు.

Read More

ఉద్యమాల పురిటిగడ్డ

తలమానికంగా తెలంగాణ తల్లి మండపం జూన్​ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకకు సిద్ధం సారథి న్యూస్, నర్సాపూర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ప్రతీకగా హత్నూర మండలం కాసాల-దౌల్తాబాద్ శివారులోని చౌరస్తాలో తెలంగాణ తల్లి మండపాన్ని ఏర్పాటుచేశారు. టీఆర్ఎస్ అనుబంధ, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవులపల్లి గ్రామానికి చెందిన పొట్టి జనార్దన్ రెడ్డి ఈ మందిరం నిర్మాణానికి విశేషంగా కృషిచేశారు. 2010 సెప్టెంబర్ 13న అప్పటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కె.చంద్రశేఖర్​ రావు […]

Read More

కృష్ణాజలాలను తరలిస్తే ఊరుకోం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: దక్షిణ తెలంగాణ ప్రజల గోస తీరాలంటే కృష్ణానదిపై ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు. కృష్ణాజలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్​ హాల్​లో జర్నలిస్టులకు బియ్యం, ఇతర నిత్యవసర […]

Read More