సారథి న్యూస్, హైదరాబాద్: పోలీసులకు ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే శరీరానికి అలుపు రాకుండా శిక్షణ ఇస్తున్నారు ఓ పోలీస్ ఆఫీసర్. పాటకు లయబద్ధంగా చేయిస్తున్న కసరత్తు ఆకట్టుకుంటోంది. తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పాటతో రిథమిక్‌గా శిక్షణ ఇస్తున్నారు. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేందుకు పాటలు పాడుతూ శిక్షణ ఇస్తుంటారు. 1970లో వచ్చిన హమ్‌జోలీ […]