సామజిక సారథి, ములుగు ప్రతినిధి: ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి నిరశ్రాయులుగా మారిన ఆడపిల్లలకు శనివారం ఆమె ఆసరాగా నిలిచారు. ములుగు జిల్లా జగ్గన్నగూడెం గ్రామానికి చెందిన పైడయ్య మరణించడంతో నలుగురు అమ్మాయిలు నిరశ్రాయులుగా మారారు. అతడి దహన సంస్కారాలు కోసం తస్లీమా సహాయం చేసిన విషయం అందరికి విదితమే. సోమవారం అతడి దశదినకర్మ కావడంతో కార్యక్రమం చేయడానికి కూడా స్థోమత లేక తస్లీమాని ఆశ్రయించగా శనివారం వెళ్ళి పరామర్శించారు. దశదిన కర్మ కోసం కావాల్సిన బియ్యం, నూనె, నిత్యావసర సరుకులను అందించారు. బాధిత కుటుంబసభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. సబ్ రిజిస్టార్ వెంట సర్వర్ ఛారిటబుల్ ట్రస్టు ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు.
- December 12, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Assistance
- MULUGU
- Registrar
- Sub
- WARANGAL
- ములుగు
- రిజిస్ట్రార్
- వరంగల్
- సబ్
- సహాయం
- Comments Off on బాధితులకు సబ్ రిజిస్ట్రర్ సహాయం