సామాజిక సారథి, వైరా: సచివాలయాలు, దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్ పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ సాకుతో 2019-20 కి సంబంధించిన రూ.767 కోట్లు, 2020-21 సంబంధించిన రూ. 2250 కోట్ల నిధులు విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఈనెల 29వ తేదీన ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాదిమంది విద్యార్థులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ డివిజన్ సహాయ కార్యదర్శి శశి, వైరా, కల్లూరు డివిజన్ నాయకులు సాయి, గోపాలకృష్ణ, ప్రభాకర్, కార్తీక్, మధు, గోపి పాల్గొన్నారు.
- November 27, 2021
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- Fees
- KHAMMAM
- Reimbursement
- STUDENTS
- Viira
- ఖమ్మం
- ఫీజు
- రియంబర్స్మెంట్
- విద్యార్థులు
- వైరా
- Comments Off on వైరాలో కదంతొక్కిన విద్యార్థులు