సారథి, రామాయంపేట: ఈ వానాకాలం సీజన్ లో రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, ఎవరైనా సీడ్ షాప్ ఓనర్లు నకిలీ సీడ్స్ ను రైతులకు అంటగడితే చట్టరీత్యాచర్యలు తీసుకుంటామని నిజాంపేట అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ హెచ్చరించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీచేసి స్టాక్ రిజిస్టర్, ధరల పట్టిక, బిల్లు బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే సంకల్పంతో వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు షాపుల్లో విత్తనాల నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నామని ఆయన తెలిపారు.
- June 16, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- NIZAMPET
- RAMAYAMPET
- SEEDS
- నకిలీ విత్తనాలు
- నిజాంపేట
- రామాయంపేట
- Comments Off on నకిలీ సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు