సామాజిక సారథి మిర్యాలగూడ:బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను మంగళవారం నాడు కలెక్టర్ గారి ఛాంబర్ లో నల్లగొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న బీసీ విద్యార్థి సంఘం నాయకులను అభినందించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై విలువైన పోరాటం చేస్తున్నటువంటి నాయకులు భవిష్యత్తులో రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని వారి యొక్క తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా ఐఏఎస్,ఐపీఎస్ లు అయ్యే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థి నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లకు, బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణమే వారికి సొంత బిల్డింగులు నిర్మించి ఆదుకోవాలని కలెక్టర్ గారిని కోరినట్లు తెలిపారు. అంతేకాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల యొక్క మేస్చార్జీలు కూడా పెంచాలని చెప్పేసి కలెక్టర్ గారిని విన్నవించినట్లు తెలిపారు.బీసీ గురుకులాల్లో సంక్షేమ హాస్టల్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వందేల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కారింగుల నరేష్ గౌడ, రజక సంఘం నాయకులు శెట్టిపల్లి యాదగిరి, రామన్న గౌడ్, శివకుమార్,మండల యాదగిరి యాదవ్,సతీష్ కుమార్,చెన్నయ్య,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు…
- January 31, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- BC
- BC SANGHAM
- BC vidyarthi
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ