సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 15 నుంచి ప్రాథమికోన్నత పాఠశాలలు, 22 నుంచి ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చిత్రారామచంద్రన్ కు లేఖ రాశారు. ఈనెల మొదటి 1 నుంచి 9, 10 ఆపై తరగతులు ప్రారంభమై సజావుగా కొనసాగుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రంలో కూడా అన్ని తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. కావునా మన రాష్ట్రంలో కూడా ఇతర తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు.
- February 8, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- SCHOOLS OPENING
- TELANGANA
- TSUTF
- టీఎస్‌యూటీఎఫ్
- తరగతుల ప్రారంభం
- తెలంగాణ
- Comments Off on 15 నుంచి అప్పర్ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించండి: యూటీఎఫ్