Breaking News

స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తుంది

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. ‘‘ఇందులో కొత్త పాయింట్ ఉంది. నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడు. అర్జున్ ఎ, అర్జున్ బి… సినిమాలో నా క్యారెక్టర్ రెండు షేడ్స్‌లో ఉంటుంది. గతం మర్చిపోకముందు పోలీస్ రోల్ చేయడానికి కొంత మంది ఇన్‌స్పిరేషన్ ఉన్నారు. గతం మర్చిపోయిన తర్వాత క్యారెక్టర్ కోసం ఎటువంటి స్ఫూర్తి లేదు. దానికి కొంచెం కష్టపడ్డాను. కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటుందని ఊహించి చేశా. స్టంట్స్ విషయంలో నేను రిస్క్ చేశానని అందరూ అంటున్నారు. నా కంటే ముందు ఆనంద ప్రసాద్ గారు రిస్క్ చేశారు. శ్రీకాంత్ అన్నయ్య మంచి వ్యక్తి. భరత్ ఫెంటాస్టిక్ యాక్టర్. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఇది. యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్స్ సినిమాను ఎక్కువ నిలబెడతాయి’’ అని అన్నారు. వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ మా సంస్థలో నిర్మించిన ఈ మూవీ ఈ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ సినిమాలో నాది పాజిటివ్ క్యారెక్టరా? నెగిటివ్ క్యారెక్టరా? అనేది సస్పెన్స్. సుధీర్ రెండు క్యారెక్టర్లలో బాగా చేశాడు. ఆనంద ప్రసాద్ గారు కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మించారు’’ అని అన్నారు. భరత్ మాట్లాడుతూ ‘‘సినిమా చూసి నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మంచి థ్రిల్లర్ ఇది. భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్, అన్నే రవి గారికి, దర్శకుడు మహేష్ కు థాంక్స్. సుధీర్ బాబు సినిమాల్లో ఇది బెస్ట్ అవుతుంది. టెక్నికల్ గా చెప్పాలంటే… నా స్ట్రెయిట్ తెలుగు సినిమా ఇది’’ అని అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల మీద మా ‘హంట్’ స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. యాక్షన్ సీక్వెన్సులు మాత్రమే కాదు… స్ట్రాంగ్ ఎమోషనల్ కంటెంట్ ఉంది. ట్రైలర్ చూసి కథ ఊహించినా థియేటర్లకు వచ్చిన మీకు కిక్ ఇస్తుంది” అని అన్నారు.