సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్లపెల్లిలో సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ నల్లాల విక్రమ్ గురువారం పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శానిటైజేషన్ చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని, ఎవరికైనా కరోనా అని అనుమానంగా ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని సర్పంచ్ గడ్డం జైపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ నల్లాల విక్రమ్ తెలిపారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
- May 13, 2021
- Archive
- Top News
- కరీంనగర్
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- JAGITYALA
- SANITATION
- takallapally
- జగిత్యాల
- తక్కళ్లపల్లి
- శానిటైజేషన్
- Comments Off on ఊరంతా క్లీన్ గా ఉండాలని శానిటైజేషన్