Breaking News

దిగులొద్దు.. ధాన్యం కొంటాం

దిగులొద్దు.. ధాన్యం కొంటాం

సామాజిక సారథి, వెల్దండ: మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు తెలిపారు. శుక్రవారం సింగిల్​విండో కార్యాలయంలో కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. మండలంలో ఐదువేల ఎకరాల్లో వరి సాగు చేశారని, సుమారు ఒక లక్ష 30 వేల బస్తాలు వరి ధాన్యం రావొచ్చని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మండలంలో వెల్దండతో పాటు కొట్ర, రాచూరు, కుప్పగండ్ల, బొల్లంపల్లి, చెరుకూరు గ్రామాల్లో వరి కొనుగోలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. క్వింటాలుకు రూ.1,960 మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మట్ట వెంకటయ్య గౌడ్, నాగులు నాయక్, శేఖర్, జంగయ్య, రాజేందర్ రెడ్డి, రాఘవేందర్, నరేష్, కార్యదర్శి శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, సాధిక్ తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.