సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతిరవీందర్ రావు, స్థానిక సర్పంచ్ ప్రేమలత పూర్ణ చందర్ రావు, ఎంపీటీసీ బోయినపల్లి సోమేశ్వర రావు, నందనం సొసైటీ చైర్మన్ చందర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్ ఐనవోలు దేవస్థానం చైర్మన్ మునిగాల సమ్మయ్య, ఉప సర్పంచ్ బండి మహేందర్ గౌడ్, సర్పంచులు కంజర్ల రమేష్, గుజ్జ సంపత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.