Breaking News

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రటరీగా ఉండడం అదృష్టం

సారథి న్యూస్​, మానవపాడు: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి గొప్ప వ్యక్తి గురుకులాలకు సెక్రటరీగా ఉండడం ఈ ప్రాంత విద్యార్థుల అదృష్టమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని ఆయన అన్నారు. అలంపూర్​ లో నిర్వహించిన స్వేరోస్​ సంబరాల్లో గురువారం ఉదయం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన మొదట ఉండవెల్లి మండలం బైరాపురం నుంచి అలంపూర్ వరకు తలపెట్టిన 10కే రన్ లో పాల్గొన్నారు. అలంపూర్ మున్సిపల్ చైర్​పర్సన్​ మనోరమ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సాయంత్రం అలంపూర్ చౌరస్తా నుంచి ర్యాలీ అలంపూర్ కు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గురుకులాల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్​పర్సన్ ​సరిత పాల్గొన్నారు. విద్యారంగం అభివృద్ధికి సుమారు 90 గదులు మంజూరు చేయించానని అబ్రహం అన్నారు. విద్యావ్యవవస్థ బాగుంటేనే దేశభవితం బాగుంటుందన్నారు. వచ్చే రోజుల్లో గురుకులాల పిల్లలు మరింత ఉన్నత శిఖరాలకు వెళ్తారని ఎమ్మెల్యే అన్నారు. డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక శక్తి అని కొనియాడారు.

పూలవర్షంలో డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​కు ఘనస్వాగతం

దేశానికి దిశానిర్దేశం ఇచ్చే పౌరులను అందిస్తాం
అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లడుతూ.. తెలంగాణ రాష్ర్టంలో చదువుకునేందుకు వనరులు పుష్కలంగా ఉన్నాయని అందరూ చదువుకోవాలని కోరారు. గురుకులాల నుంచి దేశానికి దిశానిర్దేశం ఇచ్చే పౌరులను అందిస్తానని అన్నారు. చదువే తమ ఆస్తిగా భావించి చదవాలన్నారు. గురుకులాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులు అయ్యారని వివరించారు. అనంతరం గురుకులాల నుంచి ఉన్నత విద్యనభ్యసించిన స్టూడెంట్లు, ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులను సన్మనించారు. కార్యక్రమంలో మార్కెటింగ్​శాఖ జేడీ లక్ష్మీబాయి, ఫిట్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్​ఎస్ ​ప్రసన్నకుమార్, సీనియర్ స్వేరో, గురుకుల అసిస్టెంట్​ స్పోర్ట్స్​ ఆఫీసర్​ ఎస్​.స్వాములు, కనకం బాబు, మహేష్, కవిత, భైరాపురం రమణ, ఉండవెల్లి సుంకన్న, ఉపాధ్యాయులు వెంకటేష్, రమేష్, సామేలు, స్వేరో జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, శ్రీను, పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ర్యాలీలో డాక్టర్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​
పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలుకుతున్నస్వేరోస్​
సర్టిఫికెట్​ అందజేస్తున్న ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్​, అబ్రహం