సారథి, వాజేడు: వాజేడు మండల కేంద్రంలో 30 ఏండ్లుగా ఆర్ఎంపీగా వైద్య సేవలందించిన డాక్టర్ పాండురంగ రాజు అలియాస్ పాయబాట్ల రాజు(80)కు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజు పలు గ్రామాల ప్రజలతో పాటు పక్క రాష్ట్రామైన ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చే వారికి ప్రథమ చికిత్స ద్వారా మెరుగైన వైద్యమందిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. తక్కువ ఖర్చులతో అనేకమంది ప్రాణాలను నిలబెట్టిన ప్రాణదాత ఆదివారం కరోనా కాటుకు బలికావడంతో ప్రజలు దిగ్ర్భాంతి వ్యక్తంచేస్తున్నారు. ఆర్ఎంపీ మృతికి మండల ఆర్ఎంపీలు, పలు రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం ప్రకటించారు.
- May 10, 2021
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ఖమ్మం
- తెలంగాణ
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Comments Off on ఆర్ఎంపీ మృతి.. పలువురి దిగ్ర్భాంతి