సారథి ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు జూన్ 15 నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నారు. జూన్ 25వ తేదీలోగా రైతుల ఖాతాల్లో నగదు జమ పూర్తికానుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖపై చేసిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. పార్ట్ బీ నుంచి పార్ట్ ఏలోకి చేరిన రైతులకు రైతుబంధు వర్తించనుంది. జూన్ 10 కటాఫ్ తేదీగా ఈ పథకం వర్తింపు ఉండనుంది. విత్తనాలు, ఎరువుల్లో కల్తీని అరికట్టాలని సీఎం సూచించారు. కల్తీ నివారణకు అవసరమైన చట్టసవరణ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆర్డినెన్స్ జారీచేయాలని కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్ కుమార్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సి డ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
- May 29, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- RYTHUBANDHU
- TELANGANA
- తెలంగాణ
- రైతుబంధు
- సీఎం కేసీఆర్
- Comments Off on జూన్ 15 నుంచి ‘రైతుబంధు’