సారథి, సిద్దిపేట ప్రతినిధి, హుస్నాబాద్: ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయుతనిచ్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆ కుటుంబానికి రూ.1లక్ష అందించడమే కాకుండా ఆ కుటుంబానికి అండగుంటున్న ప్రజానాయకుడు కేసీఆర్ అన్నారు. అనంతరం హుస్నాబాద్ 79, అక్కన్నపేట 47, చిగురుమామిడి మండలంలోని 6గురికి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల తహసీల్ధార్లు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
- May 3, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Checks
- DISTRIBUTION
- HUSNABAD
- KALYANA LAKSHMI
- MLA
- Satish
- Shadhimubarak
- Voditela
- ఎమ్మెల్యే
- కళ్యాణలక్ష్మి
- చెక్కులు
- పంపిణీ
- వొడితెల
- షాధిముబారక్
- సతీష్ కుమార్
- హుస్నాబాద్
- Comments Off on ప్రజాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం