Breaking News

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అడిషనల్​కలెక్టర్‌ మనుచౌదరి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.