సామజిక సారథి, రాజోలి : డీజిల్, పెట్రోల్ ధరలపై వ్యాట్‌ను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుంచి ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి నెలరోజులు గడుస్తున్నా… తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు వ్యాట్ ను తగ్గించలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వాటాను తగ్గించకుంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంజీవరెడ్డి, బీజేవైఎం రంజిత్ కుమార్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.