- ఫలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈ సంధర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి దయాకర్‌రావు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, చైర్మన్ మర్రి యాదవరెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, ఉమ్మడి వరంగల్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.