Breaking News

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం

సారథి న్యూస్​, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు