Breaking News

పంటలో సస్యరక్షణ పాటించాలి

పంటలో సస్యరక్షణ పాటించాలి

సారథి న్యూస్, రామాయంపేట: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటలో అధిక దిగుబడులను పొందడానికి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని కృషివిజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని నార్లాపూర్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి పంటలో మొగి పురుగు నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను చల్లుకోవాలని, అలాగే అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ లేదా కాసుగామైసీన్ ను పిచికారీ చేయాలని సూచించారు. రైతులంతా సేంద్రియ సాగు వైపు దృష్టిసారించాలని కోరారు. అనంతరం రైతు సమితి క్యాలెండర్​ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సతీష్, ఏఈవో శ్రీలత, పీఏసీఎస్​చైర్మన్ అందె కొండల్ రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ రామచంద్రారెడ్డి, రైతులు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజేష్, యాదిరెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.